three years completed for she teams in hyderabad

ఇంటా బయటా వేధింపులు.. కళాశాలల ప్రాంగణాల్లో ఈవ్‌టీజింగ్‌లు.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో అసభ్య సందేశాలతో మానసికంగా చిత్రవధ చేసే పోకిరీలు.. వీరి బారిన పడి ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న వేలాదిమంది విద్యార్థినులు.. యువతులు... మహిళలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు.
ఆమెకు రక్షణగా నిలవాలన్న ధ్యేయంతో 'షి'బృందాలను ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాలు.. కార్పొరేటు సంస్థలు.. ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థలు ఇలా ఎక్కడైనా సరే ఈవ్‌టీజింగ్‌.. వేధింపులను 'షి' బృందాలు నిరోధించాయి. ఇంతేకాదు... పోకిరీలు.. ఈవ్‌టీజర్లును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ప్రత్యక్షంగా... పరోక్షంగా యువతులు.. విద్యార్థినుల సమస్యలను పరిష్కరిస్తున్న 'షి'బృందాలు మూడేళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో అందరికీ చిరపరిచితమైన తాము మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నామని అదనపు సీపీ(నేరపరిశోధన) స్వాతిలక్రా వివరించారు.
ప్రభావం... ఫలితాలు
* 'షి'బృందాలు కంటికి కనిపిస్తుండడం, నేరస్థులను ఏ అరెస్ట్‌ చేస్తుండడంతో స్త్రీవ్యతిరేక హింస కేసులు 20శాతం తగ్గాయి.
* 'షి'బృందాల తరహాలో మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశాలో 'షి'బృందాలు ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.
* వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నేరస్థులను పట్టుకుని అరెస్ట్‌ చేస్తున్నారు.
* 'షి' బృందాలు ఎందుకున్నాయ్‌? ఎలా రక్షిస్తున్నాయ్‌? అన్న అంశాలతో తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా పొందుపరిచారు.
భవిష్యత్తు కార్యాచరణ...
* అన్నివర్గాల వారికి 'షి'బృందం చేరువయ్యేందుకు, పనితీరును అవగాహన చేసుకునేందుకు వేర్వేరు స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం.
* కళాశాలలు, విద్యాసంస్థల్లో కార్యశాలలను ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించి తదనుగుణంగా చర్యలు చేపట్టడం.
* స్వీయ ఆత్మరక్షణ కోసం కరాటేలో బ్లాక్‌బెల్టులు, మల్ల విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ విద్యార్థినులకు అవగాహన కల్పించడం, సులభమైన పది సూత్రాలను నేర్పించడం.
* న్యాయవాదులు, వైద్యులు, గృహిణులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వ్యాపారుల ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వారితో బృందాలను ఏర్పాటు చేసి వేధింపులు భరిస్తున్న వారికి భరోసా ఎలా ఇవ్వాలో అవగాహన కల్పించడం.
* క్యాబ్‌, ఆర్టీసీడ్రైవర్లు, మహిళా కండక్టర్లకు వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లపై అవగాహన సదస్సులు నిర్వహించడం.
ఫిర్యాదులు.. పరిష్కారం.. శిక్షలు
* డయల్‌ 100-1478,
* నేరుగా ఫిర్యాదులు-976
* ఈ-మెయిల్‌-391
* ఫేస్‌బుక్‌-336
* వాట్సాప్‌-333
* హాక్‌ఐ-98
* ట్విట్టర్‌-5.
* 1460మందిని రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఇందులో 363 మంది మైనర్లు
* 2356 మందిపై పెట్టీకేసులు నమోదు, 20శాతంమందికి జైలు, 80శాతంమందికి జరిమానా.
* ముగ్గురిపై పీడీచట్టం ప్రయోగం, 85 మందిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు, 56మందిపై క్రిమినల్‌ కేసులు
నేరస్థులు.. స్వభావాలు...
మైనర్లు-27శాతం, 18-20ఏళ్లు-28శాతం 21-40ఏళ్లు-44శాతం, 41-55ఏళ్లు-0.7శాతం, 55ఏళ్లు..ఆపై.. 0.3శాతం.
పదేపదే వెంటాడ్డం: 32శాతం, ఫోన్‌లో వేధింపులు:20శాతం, అసభ్యంగా మాట్లాడ్డం:20శాతం, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు:18శాతం, దురుద్దేశంతో తాకడం:3శాతం, ఫోటోలు తీయడం:2శాతం, బహిరంగ ప్రదేశాల్లో వేధించడం:5 శాతం.

Comments

Popular posts from this blog

best new balance mens running shoes

stylish tennis shoes for girls