Posts

Showing posts from October, 2017

three years completed for she teams in hyderabad

Image
ఇంటా బయటా వేధింపులు.. కళాశాలల ప్రాంగణాల్లో ఈవ్‌టీజింగ్‌లు.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో అసభ్య సందేశాలతో మానసికంగా చిత్రవధ చేసే పోకిరీలు.. వీరి బారిన పడి ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న వేలాదిమంది విద్యార్థినులు.. యువతులు... మహిళలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఆమెకు రక్షణగా నిలవాలన్న ధ్యేయంతో 'షి'బృందాలను ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాలు.. కార్పొరేటు సంస్థలు.. ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థలు ఇలా ఎక్కడైనా సరే ఈవ్‌టీజింగ్‌.. వేధింపులను 'షి' బృందాలు నిరోధించాయి. ఇంతేకాదు... పోకిరీలు.. ఈవ్‌టీజర్లును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ప్రత్యక్షంగా... పరోక్షంగా యువతులు.. విద్యార్థినుల సమస్యలను పరిష్కరిస్తున్న 'షి'బృందాలు మూడేళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో అందరికీ చిరపరిచితమైన తాము మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నామని అదనపు సీపీ(నేరపరిశోధన) స్వాతిలక్రా వివరించారు. ప్రభావం... ఫలితాలు * 'షి'బృందాలు కంటికి కనిపిస్తుండడం, నేరస్థులను ఏ అరెస్ట్‌ చేస్తుండడంతో స్త్రీవ్యతిరేక హింస కేసులు 20శాతం తగ్